Raghurama: వైకాపాలో తిరగబడే రోజులు మొదలయ్యాయి: ఎంపీ రఘురామ

ఏపీలో తమ పార్టీలో అవమానాలు దిగమింగుకుంటూ ఉన్నవాళ్లంతా ఆత్మగౌరవంతో తిరగబడే రోజులు మొదలయ్యాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Published : 03 Feb 2023 08:36 IST

ఈనాడు, దిల్లీ: ఏపీలో తమ పార్టీలో అవమానాలు దిగమింగుకుంటూ ఉన్నవాళ్లంతా ఆత్మగౌరవంతో తిరగబడే రోజులు మొదలయ్యాయని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లాలో ఒకే సామాజికవర్గానికి చెందిన ముగ్గురు ప్రజాప్రతినిధులతో తిరుగుబాటు ప్రారంభమైందని అభివర్ణించారు.

మరోవైపు పార్లమెంట్‌ చట్టం ద్వారానే ఏపీ రాజధాని మార్పు సాధ్యమని ఎట్టకేలకు మాజీ మంత్రి కొడాలి నాని గ్రహించారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు రాకపోతే రానున్న ఎన్నికల్లో 175 శాసనసభ స్థానాలు, 25 పార్లమెంటు స్థానాలు గెలుచుకొని కేంద్రంతో పార్లమెంట్‌లో బిల్లు పెట్టించి విశాఖను రాజధానిగా చేస్తామంటూ ఆయన పేర్కొన్నారని గుర్తుచేశారు. అదానీ ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగారని, జగన్‌తో స్నేహం తర్వాత ఆయన కంపెనీ షేర్లు కుప్పకూలిపోయాయని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని