మీరు ఆదాయపన్ను చెల్లింపుదారులా.. సీఏను కలవండి

ఆదాయ పన్ను విషయంలో కొత్త పన్ను, పాత పన్ను విధానాల మధ్య గందరగోళం నడుస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం గురువారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Updated : 03 Feb 2023 06:13 IST

బడ్జెట్‌పై చిదంబరం వ్యంగ్యాస్త్రాలు

దిల్లీ: ఆదాయ పన్ను విషయంలో కొత్త పన్ను, పాత పన్ను విధానాల మధ్య గందరగోళం నడుస్తోందని కాంగ్రెస్‌ నాయకుడు పి.చిదంబరం గురువారం కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘మెజారిటీ ప్రజలకు వ్యక్తిగత పొదుపు మార్గమే సామాజిక భద్రత. మీరు ఒకవేళ పన్ను చెల్లింపుదారులైతే.. అప్పుడే ఓ నిర్ణయానికి వచ్చేయకండి. మీ లెక్కలు మీరు వేసుకోండి. ఓ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌(సీఏ)ను కలవండి’’ అంటూ ఆయన వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు.


పన్ను రాయితీలు.. ఎన్నికల స్టంట్‌ : నీతీశ్‌

సహస్ర: ఆదాయ పన్నులో రాయితీలు.. ఎన్నికల స్టంట్‌లో భాగమని బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌ గురువారం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. సమాధాన్‌ యాత్రలో భాగంగా సహస్ర జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మాట్లాడుతూ.. ‘‘బిహార్‌ లాంటి పేద రాష్ట్రాలను ఈ బడ్జెట్‌లో విస్మరించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌ను పట్టించుకోలేదు’’ అని అన్నారు. అధిక ఆదాయం ఉన్నవారికి అధిక పన్ను రాయితీలు ఇచ్చారని ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి విజయ్‌ కుమార్‌ ఛౌదరి విమర్శించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని