‘నెల్లూరు’ వెనుక ‘ఒంగోలు’ నేత.. బాలినేనిపై సుబ్బారావు గుప్తా విమర్శలు

నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సహా అందరినీ విమర్శించారని., అదే సమయంలో మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదని ఆ పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అన్నారు.

Updated : 03 Feb 2023 12:23 IST

ఒంగోలు నేరవిభాగం, న్యూస్‌టుడే: నెల్లూరు గ్రామీణ వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తన ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి సహా అందరినీ విమర్శించారని., అదే సమయంలో మాజీమంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదని ఆ పార్టీ నేత సోమిశెట్టి సుబ్బారావు గుప్తా అన్నారు. ఒంగోలులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బాలినేని సమన్వయకర్తగా ఉన్న జిల్లా నుంచే వైకాపాలో లుకలుకలు మొదలయ్యాయని పేర్కొన్నారు. ఇది సీఎం జగన్‌ గుర్తించాలన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 23 మంది వైకాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెదేపాలో చేరటం వెనుక కూడా ఒంగోలు నాయకుల హస్తం ఉందని గుప్తా ఆరోపించారు. కేవలం వ్యాఖ్యలు చేస్తేనే నెల్లూరు జిల్లాలో ఇద్దరిని పదవుల నుంచి తొలగించారని, ఒంగోలులో తమ బంధువైన బాలినేనిపై మాత్రం చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు