Somu Veerraju: కలసి వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగానే పోటీ: సోము వీర్రాజు

రాబోయే ఎన్నికల్లో కలసి వస్తే జనసేన పార్టీతోను.. లేకుంటే ఒంటరిగానే పోటీచేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు.

Updated : 03 Feb 2023 09:30 IST

అరకులోయ, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో కలసి వస్తే జనసేన పార్టీతోను.. లేకుంటే ఒంటరిగానే పోటీచేస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో గురువారం ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సోము వీర్రాజు మాట్లాడుతూ.. సాధారణ ఎన్నికల్లో వైకాపా, తెదేపాలకు భాజపా సమాన దూరంలో ఉంటుందన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం కేవలం తొమ్మిది సంక్షేమ పథకాలనే అమలు చేస్తుంటే, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 60 పథకాలతో ప్రజలను ఆదుకుంటోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని