విధ్వంసాన్ని అద్భుతంగా చూపే యత్నమా!

ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని గవర్నర్‌ తన ప్రసంగంలో అద్భుతం అని చూపించే ప్రయత్నం చేశారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు.

Updated : 04 Feb 2023 04:09 IST

గవర్నర్‌ ప్రసంగంపై కోదండరాం ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: ఎనిమిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన విధ్వంసాన్ని గవర్నర్‌ తన ప్రసంగంలో అద్భుతం అని చూపించే ప్రయత్నం చేశారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం విమర్శించారు. శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. ‘రాష్ట్రం పురోగతి చెందిందని గవర్నర్‌ ప్రసంగంలో చెప్పడం బాధాకరం. కాళేశ్వరం పూర్తయిందనడమూ పెద్ద అబద్ధం. ఈ ప్రాజెక్టు పూర్తయితే 16 లక్షల ఎకరాలకు సాగునీరు ఎందుకు అందించడం లేదు. డిజైన్‌ లోపాల కారణంగా వరదలు వచ్చినప్పుడు ముంపునకు గురవుతోంది. రాష్ట్రం ఫ్లోరైడ్‌ సమస్య నుంచి విముక్తి పొందిందనటమూ అవాస్తవమే. కృష్ణాజలాల్లో రాష్ట్ర వాటా సాధించడంపై పురోగతిని ప్రభుత్వం స్పష్టం చేయాలి’ అని ఆయన పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని