సిమెంటు రోడ్లు వేసేందుకు డబ్బుల్లేవ్‌.. ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి

‘సిమెంటు రోడ్లు వేయలేం.. డబ్బుల్లేవు.. నిర్మించిన రోడ్లకు ప్రభుత్వం నగదు ఇవ్వకపోవడంతో వేసినవారు అప్పుల పాలయ్యారు.

Updated : 04 Feb 2023 06:23 IST

కలిగిరి, న్యూస్‌టుడే: ‘సిమెంటు రోడ్లు వేయలేం.. డబ్బుల్లేవు.. నిర్మించిన రోడ్లకు ప్రభుత్వం నగదు ఇవ్వకపోవడంతో వేసినవారు అప్పుల పాలయ్యారు. చేసిన పనులకు బిల్లులివ్వక కొంతమంది నష్టపోయారు’ అని శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. స్థానిక నాయకులు ‘సార్‌... మీడియా వాళ్లున్నా’రని ఎమ్మెల్యేను అప్రమత్తం చేయగా ఉంటే ఏం చేయాలి? పనులు చేసినోళ్లకు డబ్బులు రాలేదు. ఎవరు చేస్తారో చెప్పండని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్డీలకు అప్పులు తెచ్చి ఎవరు సొమ్ములు పెట్టి రోడ్లు వేయగలరని ప్రశ్నించారు. కలిగిరి మండలం నాగసముద్రం సచివాలయ పరిధిలో శుక్రవారం జరిగిన గడపగడపకు మన ప్రభుత్వంలో ఆయన పాల్గొన్నారు. చీమలవారిపాలెం ఎస్సీ కాలనీలో పర్యటిస్తున్నప్పుడు సిమెంటు రోడ్లు నిర్మించాలని స్థానికులు కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఎక్కడైనా ఒక ఇల్లు కట్టించారా? అంటూ నిలదీశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని