కోటంరెడ్డిపై కేసు నమోదు

నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వేదాయపాళెం పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు.

Updated : 04 Feb 2023 06:19 IST

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై వేదాయపాళెం పోలీసులు శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. పడారుపల్లికి చెందిన 22వ డివిజన్‌ కార్పొరేటరు విజయభాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీధర్‌రెడ్డి, ఆయన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్‌, కారు డ్రైవరు అంకయ్యలపై సెక్షన్‌ 448, 363ల కింద అపహరణ యత్నం కేసు పెట్టారు. తన కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యే ఫొటోను తొలగించడంతో సాయంత్రం కోటంరెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని.. ఆయనతో హాని ఉందంటూ కార్పొరేటర్‌ ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదైంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు