Andhra News: నోరు జాగ్రత్త.. బండికి కట్టి లాక్కుపోతా!.. కోటంరెడ్డికి బెదిరింపులు

‘ముఖ్యమంత్రి జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికి వస్తే.. బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య లాక్కొని వెళ్తాను.

Updated : 04 Feb 2023 08:59 IST

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: ‘ముఖ్యమంత్రి జగన్‌, సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ పెద్దల జోలికి వస్తే.. బండికి కట్టుకుని నెల్లూరు అంగళ్ల మధ్య లాక్కొని వెళ్తాను. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరం లేదు. అయిదు నిమిషాల్లో వచ్చి లాక్కొనిపోతా’ అంటూ కడపకు చెందిన బోరుగడ్డ అనిల్‌ అనే వ్యక్తి నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని బెదిరించాడు. దీనికి సంబంధించిన ఆడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. తనను తాను వైకాపా మద్దతుదారుడిగా చెప్పుకొన్న అనిల్‌.. ‘నీ కథ మొత్తం నాకు తెలుసు. నీ తమ్ముడు నీ కంటే ఎక్కువ మాట్లాడుతున్నాడు. మీ ఇద్దరినీ ప్రజలు తరిమికొట్టే రోజు చూడు. డేట్‌ ఫిక్స్‌ చేసుకో! నీ ఇంటికి వచ్చి కట్టుకుని పోతా’ అంటూ బెదిరించాడు. తాను ముఖ్యమంత్రిని ఏమీ అనలేదని చెప్పినా.. వినకుండా ఇష్టమొచ్చినట్లు అసభ్య పదజాలంతో దూషించాడని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని