సంక్షిప్త వార్తలు(2)

తెదేపా తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య నియమితులయ్యారు.

Updated : 04 Feb 2023 06:32 IST

తుని తెదేపా ఇన్‌ఛార్జిగా యనమల దివ్య

ఈనాడు, అమరావతి: తెదేపా తుని నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్య నియమితులయ్యారు. రామకృష్ణుడికి వరుసకు సోదరుడయ్యే కృష్ణుడు 2014, 2019 ఎన్నికల్లో తుని తెదేపా అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఇన్‌ఛార్జిగా దివ్యను నియమిస్తారన్న విషయం బయటకు రావడంతో కృష్ణుడు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కర్రోతు బంగార్రాజును, తిరుపతి జిల్లా సత్యవేడు ఇన్‌ఛార్జిగా హెలెన్‌ను అధిష్ఠానం నియమించింది. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గానికి గంటి హరీశ్‌మాథుర్‌ కన్వీనర్‌గా, నామన రాంబాబు కోకన్వీనర్‌గా ద్విసభ్య కమిటీని నియమించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.


10 నుంచి జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు

ఈనాడు, అమరావతి: జనసేన పార్టీ మూడో విడత క్రియాశీల సభ్యత్వ నమోదు ఫిబ్రవరి 10 నుంచి 28 వరకు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రెండు విడతలుగా నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం చేసినట్లే దీన్ని ఫలవంతం చేయాలని పిలుపునిచ్చారు. రెండు విడతలుగా పార్టీ క్రియాశీల కార్యకర్తల సభ్యత్వ నమోదు, ఆరోగ్య బీమా కోసం తనవంతుగా రూ.2 కోట్ల విరాళం ఇచ్చినట్లే మూడో విడత కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని