గడప గడపకు నగదు పంపిణీ.. గన్నవరం ఎమ్మెల్యే వంశీ తీరిదీ

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ధన ప్రవాహం కనిపిస్తోంది.

Published : 04 Feb 2023 06:37 IST

హనుమాన్‌జంక్షన్‌, న్యూస్‌టుడే: కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గంలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ధన ప్రవాహం కనిపిస్తోంది. సమస్యలు తెలుసుకునేందుకు ఇంటింటికీ తిరుగుతున్న ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, సాయం అడిగిన వారికి, అడగని వారికి నగదు కవర్లు చేతిలో పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఒక్కో కవరులో రూ.2 వేలు, రూ.5 వేలు, రూ.10 వేలు ఉంటున్నాయి. స్థానికుల జీవన పరిస్థితులు, వారి ఇబ్బందులు తెలుసుకున్న ఎమ్మెల్యే సందర్భాన్ని బట్టి తన అనుచరులకు ఏ కవరు ఇవ్వాలనేది సైగ చేస్తుంటారు. దీని కోసం ఇద్దరు అనుచరులు నిరంతరం ఆయన వెన్నంటే ఉంటున్నారు. ఒకరు ఆ రోజుకు కావాల్సిన నగదు కవర్లతో కూడిన సంచిని మెడకు తగిలించుకుని, మరొకరు.. ఎమ్మెల్యే అడిగిన వెంటనే ఇచ్చేందుకు వీలుగా పైజేబులో ఓ కవరు పెట్టుకుని ఆయన్ను అనుసరిస్తుంటారు. వంశీ ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మొదలు ఈ నగదు పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు ముందస్తుగానే వంశీ ఈ విధంగా నగదు పంచుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. శుక్రవారం హనుమాన్‌జంక్షన్‌ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో గడప గడపకు తిరుగుతూ ఎమ్మెల్యే కవర్లు అందిస్తున్న దృశ్యాలు ‘న్యూస్‌టుడే’ కెమెరాకు చిక్కాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు