రోడ్డు సమస్య చెబితే చేయిచేసుకున్న ఎమ్మెల్యే
అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన గడపగడపకు కార్యక్రమంలో స్థానికంగా నివాసమున్న లక్ష్మీనారాయణపై ఎమ్మెల్యే చేయిచేసుకోవడంతో స్థానికులంతా అక్కడికి చేరుకున్నారు.
తనపై చేయి వేశాడని ఆగ్రహం
బాధితుడిని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
మదనపల్లె పట్టణం, న్యూస్‌టుడే: అన్నమయ్య జిల్లా మదనపల్లె పురపాలక సంఘం పరిధిలో శుక్రవారం రాత్రి జరిగిన గడపగడపకు కార్యక్రమంలో స్థానికంగా నివాసమున్న లక్ష్మీనారాయణపై ఎమ్మెల్యే చేయిచేసుకోవడంతో స్థానికులంతా అక్కడికి చేరుకున్నారు. దీంతో నీరుగట్టువారిపల్లెలో ఉద్రిక్తత నెలకొంది. ఘటన జరిగిన కొన్ని నిమిషాల్లోనే లక్ష్మీనారాయణను పోలీసులు అదుపులోకి తీసుకుని ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు మదనపల్లెలోని 32వ వార్డులో శుక్రవారం రాత్రి గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఎమ్మెల్యే నవాజ్‌బాషా పాల్గొన్నారు. రామిరెడ్డి లేఅవుట్ వినాయకునివీధిలో నివాసముంటున్న లక్ష్మీనారాయణ ఇంటి వద్దకు ఎమ్మెల్యే వచ్చారు. ఇంట్లో ఉన్న లక్ష్మీనారాయణ బయటకు వచ్చి ఆప్యాయంగా పలకరించారు. ఎమ్మెల్యే మొదట అతని భుజంపై చేయి వేసి పలకరించారు. అనంతరం ఇంటి ముందున్న రోడ్డును మరమ్మతు చేయిస్తే బాగుంటుందని కోరారు. దీంతో ఎమ్మెల్యే ప్రస్తుతమున్న రోడ్డుపైనే రోడ్డు వేయించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పగా, అలా చేస్తే రోడ్డు ఎత్తు పెరిగి ఇల్లు దిగువకు అయిపోతుందని వివరిస్తూ ఎమ్మెల్యే చేయి పట్టుకున్నట్లు అక్కడ చూసిన వారు తెలిపారు. దీంతో ఎమ్మెల్యే ఆగ్రహించి లక్ష్మీనారాయణపై చేయిచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అనంతరం ఇతన్ని పోలీసులు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. స్థానికులు కొందరు పోలీసుస్టేషన్‌కు వెళ్లి బాధితుడిని విడిచిపెట్టాలని పట్టుబట్టారు. తొగటవీర క్షత్రియ సంఘం నాయకులు అక్కడికి వచ్చారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. అనంతరం ఎమ్మెల్యే వారిని పిలిపించి సమస్యను వారికి వివరించడంతో గొడవ సద్దుమణిగింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Virat Kohli: అనుష్కను చూసి వణికిపోయా: విరాట్ కోహ్లీ
-
General News
Delhi liquor Scam: ముగిసిన విచారణ.. 8.30గంటల పాటు కవితను ప్రశ్నించిన ఈడీ
-
India News
₹10 కోట్లు ఇవ్వాలని కేంద్రమంత్రికి బెదిరింపులు.. గడ్కరీ ఇంటి వద్ద భద్రత పెంపు!
-
Movies News
Payal Rajput: పాయల్ రాజ్‌పుత్‌కు అస్వస్థత.. అయినా షూట్లో పాల్గొని!
-
Sports News
Sachin Tendulkar: సచిన్ పాదాలపై పడి క్షమాపణలు కోరిన పాక్ మాజీ పేసర్..కారణమేమిటంటే?
-
General News
NTR: ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం.. త్వరలో మార్కెట్లోకి