ఎమ్మెల్సీ ఎన్నికల్లో మహారాష్ట్ర సర్కారుకు షాక్‌

మహారాష్ట్ర శాసనమండలిలోని 5 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటిని గెలుచుకున్న ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) భాజపా సంకీర్ణ సర్కారుకు గట్టి షాక్‌ ఇచ్చింది.

Published : 04 Feb 2023 04:53 IST

5 స్థానాల్లో 3 దక్కించుకొన్న ప్రతిపక్షం

ముంబయి: మహారాష్ట్ర శాసనమండలిలోని 5 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడింటిని గెలుచుకున్న ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ) భాజపా సంకీర్ణ సర్కారుకు గట్టి షాక్‌ ఇచ్చింది. శుక్రవారం వెలువడిన ఫలితాల్లో అమరావతి డివిజన్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాన్ని ప్రతిపక్ష కూటమిలోని కాంగ్రెస్‌ పార్టీ చేజిక్కించుకుంది. జనవరి 30న పోలింగు జరిగిన మొత్తం 5 స్థానాల్లో మూడు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రుల నియోజకవర్గాలున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు