షెడ్డు తొలగించి చూడండి

షెడ్డు తొలగించి చూడండంటూ రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే సోదరుడు అనంతపురం పట్టణ ప్రణాళిక అధికారులపై మండిపడ్డారు.

Published : 05 Feb 2023 05:29 IST

పట్టణ ప్రణాళిక అధికారులకు రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే సోదరుడి హెచ్చరిక

అనంతపురం (నగరపాలక), న్యూస్‌టుడే: షెడ్డు తొలగించి చూడండంటూ రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే సోదరుడు అనంతపురం పట్టణ ప్రణాళిక అధికారులపై మండిపడ్డారు. నగరపాలక పరిధిలోని శ్రీనగర్‌ కాలనీలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి సోదరుడు రాజశేఖరరెడ్డి నగరపాలిక స్థలాన్ని ఆక్రమించి షెడ్డు నిర్మించి వైకాపా రంగులు వేశారు. దీనిపై ‘ఎమ్మెల్యే సోదరుడి కబ్జా పర్వం’ శీర్షికన గత నెల 30న ‘ఈనాడు’ ప్రధాన పత్రికలో కథనం ప్రచురితమైంది. శనివారం నగరపాలక అసిస్టెంట్‌ సిటీప్లానర్‌ శ్రీనివాసులుతోపాటు టౌన్‌ప్లానింగ్‌ అధికారులు ఆక్రమణను తొలగించేందుకు వెళ్లారు. అక్కడే ఉన్న వారి అనుచరగణంతోపాటు వైకాపా ఎమ్మెల్యే సోదరులు, మరికొందరు అధికారులకు ఫోన్‌ ద్వారా గట్టిగా హెచ్చరికలు చేశారు. చేసేదిలేక వారు వెనుదిరిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు