సజ్జలతో లావాదేవీలు జరిగాయని ప్రమాణం చేస్తావా?

తాను విలువలు, విశ్వసనీయత ఉన్న వారి గురించే మాట్లాడతానని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం అనంతపురంలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ... ‘సజ్జలకు, నాకు మధ్య లావాదేవీలు జరిగాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిందలు వేస్తున్నారు.

Published : 05 Feb 2023 05:29 IST

తిరుగుబాటు ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి మంత్రి కాకాణి సవాల్‌

అనంత నగరపాలక, న్యూస్‌టుడే: తాను విలువలు, విశ్వసనీయత ఉన్న వారి గురించే మాట్లాడతానని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి స్పష్టంచేశారు. శనివారం అనంతపురంలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ... ‘సజ్జలకు, నాకు మధ్య లావాదేవీలు జరిగాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిందలు వేస్తున్నారు. ఆరో తేదీన నెల్లూరుకే వెళుతున్నా. నేను సజ్జల ద్వారా ఎలాంటి లబ్ధి పొందలేదని దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. శ్రీధర్‌రెడ్డి కూడా వచ్చి ప్రమాణం చేస్తారా... పార్టీ నుంచి బయటికి వెళుతూ మాపై అపనిందలు వేయొద్దు. ఆధారాలుంటే చూపాలి’ అని స్పష్టంచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు