రాహుల్‌ ప్రధాని అయితే ప్రత్యేకహోదా: రుద్రరాజు

రాహుల్‌గాంధీ ప్రధాని అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పన దస్త్రంపై తొలి సంతకం చేస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు.

Published : 05 Feb 2023 05:29 IST

విజయనగరం, న్యూస్‌టుడే: రాహుల్‌గాంధీ ప్రధాని అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా కల్పన దస్త్రంపై తొలి సంతకం చేస్తారని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. శనివారం విజయనగరం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ‘చేయి చేయి కలుపుదాం...రాహుల్‌గాంధీని బలపరుద్దాం’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తెలియజేయడమే లక్ష్యంగా ‘ఇంటింటా కాంగ్రెస్‌ కరపత్రం’ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. ఉద్యోగులు గవర్నర్‌ను కలిసి కాపాడాలని వినతిపత్రం ఇవ్వడం చాలా బాధాకరమని అన్నారు. జగన్‌ ప్రభుత్వ రాక్షసపాలనకు ఇదే నిదర్శనమని మండిపడ్డారు. ఉక్కుకర్మాగార ప్రైవేటీకరణను అడ్డుకుంటామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు