ఏపీ ఐకాస అమరావతి రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక ఏకగ్రీవం

ఏపీ ఐకాస అమరావతి (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) నూతన కార్యవర్గ ఎన్నిక కర్నూలులో శనివారం జరిగింది.

Published : 05 Feb 2023 05:29 IST

కర్నూలు, న్యూస్‌టుడే: ఏపీ ఐకాస అమరావతి (ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సేవా సంఘాల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ) నూతన కార్యవర్గ ఎన్నిక కర్నూలులో శనివారం జరిగింది. 21 మంది కార్యవర్గ సభ్యులు ఆయా పదవులకు నామినేషన్లు వేయగా, అందరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఛైర్మన్‌గా బొప్పరాజు వెంకటేశ్వర్లు (రెవెన్యూశాఖ), ప్రధాన కార్యదర్శిగా పలిశెట్టి దామోదర్‌రావు (ప్రజా రవాణా), అసోసియేట్‌ ఛైర్మన్‌గా టి.వి.ఫణిపేర్రాజు (సహకార), కోశాధికారిగా వి.వి.మురళీకృష్ణనాయుడు (పీఆర్‌ ఇంజినీరింగ్‌), ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా ఎస్‌.కృష్ణమోహన్‌రావు (మున్సిపల్‌ మినిస్టీరియల్‌) నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారి కె.భావనారుషి, సహాయ ఎన్నికల అధికారి కృష్ణారావుకు అందించారు. వీరితోపాటు ప్రచార కార్యదర్శిగా బి.కిశోర్‌కుమార్‌ (కార్మిక)తోపాటు కో-ఛైర్మన్లుగా బి.విజయకుమార్‌, జి.ఓంకార్‌ యాదవ్‌, జి.శివానందరెడ్డి, జె.శ్రీనివాసరావు, ఎస్‌.శ్రీనివాసరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డి.జయధీర్‌, జి.సులోచనమ్మ, కె.పి.చంద్రశేఖర్‌, ఎస్‌.మల్లేశ్వరరావు, వి.అరళయ్య, రాష్ట్ర కార్యదర్శులుగా ఎ.కుమార్‌, ఎ.సాంబశివరావు, బీసీ శంకర్‌నాయక్‌, జి.జ్యోతి, ఆర్‌.వసంతరాయలు నామినేషన్‌ వేశారు. నూతన కార్యవర్గం మొత్తం ఏకగ్రీవంగా ఎన్నిక కాగా, రాష్ట్ర అధ్యక్షుడిగా బొప్పరాజు మూడోసారి ఎన్నికయ్యారు. షెడ్యూలు ప్రకారం ఆదివారం జరిగే మూడో రాష్ట్ర మహాసభలో ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు ఏపీ ఐకాస అమరావతి పక్షాన పోరాడతామని, ఉద్యోగుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ఆర్థిక, ఆర్థికేతర అంశాలను సాధించుకునేందుకు పోరాటం చేస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు