Andhra News: నీతో మాట్లాడను, వెళ్లవమ్మా.. వెళ్లు!: మహిళపై వైకాపా ఎమ్మెల్యే అసహనం

దివ్యాంగుడైన తన బిడ్డకు పింఛన్‌ ఇప్పించాలని కోరిన ఓ మహిళపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు.

Updated : 05 Feb 2023 09:52 IST

కావలి, న్యూస్‌టుడే: దివ్యాంగుడైన తన బిడ్డకు పింఛన్‌ ఇప్పించాలని కోరిన ఓ మహిళపై నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి అసహనం వ్యక్తంచేశారు. ఎమ్మెల్యే శనివారం పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి రాగా, స్థానికులు ‘నీళ్లు రావడం లేదు. వీధి దీపాలు వెలగడం లేదు. మురుగు పారడం లేదు’ అంటూ సమస్యలు ఏకరవు పెట్టారు. తన బిడ్డకు పింఛను ఇప్పిస్తానని ఏడాది క్రితమే చెప్పినా రాలేదని ఓ మహిళ ప్రశ్నించారు. మళ్లీ నా దగ్గరకు రాలేదుగా అని ఎమ్మెల్యే ప్రశ్నించగా, పలుమార్లు బిడ్డను ఎత్తుకొని వచ్చానని, మీరు లేరని బదులిచ్చారు. ‘ఉన్నప్పుడు రావాలి. ఇప్పుడు కావాలనే వాదనకొచ్చావు. వెళ్లవమ్మా. వెళ్ల్లు. నీతో మాట్లడను’ అంటూ ఆగ్రహించారు. నాయకులు నచ్చజెప్పి పింఛన్‌పై ఎమ్మెల్యేతో హామీ ఇప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని