జగన్‌రెడ్డి నిర్లక్ష్యం వల్లే అంకుర సంస్థల ఏర్పాటు వ్యవస్థ ధ్వంసం: చంద్రబాబు

సీఎం జగన్‌ నిర్లక్ష్య వైఖరివల్లే రాష్ట్రంలో అంకుర సంస్థల ఏర్పాటు వ్యవస్థ ధ్వంసమైందని చంద్రబాబు మండిపడ్డారు.

Published : 05 Feb 2023 05:29 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: సీఎం జగన్‌ నిర్లక్ష్య వైఖరివల్లే రాష్ట్రంలో అంకుర సంస్థల ఏర్పాటు వ్యవస్థ ధ్వంసమైందని చంద్రబాబు మండిపడ్డారు. 2019 వరకు అంకుర సంస్థల ఏర్పాటులో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం నేడు బిహార్‌ కంటే దిగువకు వెళ్లడం శోచనీయమని శనివారం ట్వీట్‌ చేశారు. ‘‘తెదేపా ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో అంకుర సంస్థల ఏర్పాటు, అభివృద్ధికి అనుకూల వ్యవస్థను ఏర్పాటు చేశాం. కానీ నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. లక్ష్యాలు, కలలు నెరవేర్చుకోవాలనే ఎందరో పారిశ్రామికవేత్తల ఆకాంక్షలను వైకాపా ప్రభుత్వం దెబ్బతీసింది. రాష్ట్రం, యువత భవిష్యత్తు ఏంటనే బాధ వేధిస్తోంది’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘అంకుర సంస్థల ఏర్పాటులో 15వ స్థానంలో ఏపీ’ పేరుతో ‘ఈనాడు’లో వచ్చిన కథనాన్ని ట్వీట్‌కు జత చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు