నాలుగేళ్ల తర్వాత గుర్తొచ్చామా?

‘మా ఆరాధ్యదైవం పోతురాజుబాబు సాక్షిగా చలిసింగాన్ని దత్తత తీసుకుంటానని, రోడ్డు వేస్తానని ప్రమాణం చేసి ఓట్లు వేయించుకున్నారు.

Published : 05 Feb 2023 04:38 IST

విప్‌ ధర్మశ్రీకి గిరిజనుల నిరసన సెగ

రావికమతం, న్యూస్‌టుడే: ‘మా ఆరాధ్యదైవం పోతురాజుబాబు సాక్షిగా చలిసింగాన్ని దత్తత తీసుకుంటానని, రోడ్డు వేస్తానని ప్రమాణం చేసి ఓట్లు వేయించుకున్నారు. ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేళ్లైంది. విప్‌ పదవి తీసుకున్నారు. హామీలు నెరవేర్చకుండా ఇప్పుడు ఎందుకొచ్చారు? డోలీ మోతలు కనిపించడం లేదా?’ అని ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీని గిరిజన యువకులు, సీపీఎం కార్యకర్తలు నిలదీశారు. అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చలిసింగం గ్రామంలో శనివారం ఆయన పర్యటించగా, గ్రామస్థులు నిరసన తెలిపారు. రోడ్డు నిర్మాణానికి రిజర్వ్‌ ఫారెస్టు నిబంధనలు అడ్డుగా ఉన్నాయని ఆయన సర్దిచెప్పినా విన్లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని