మీరు ఓ విజనరీ.. మీతోనే అమరావతి అభివృద్ధి

‘నేను వైకాపా వీరాభిమానిని. కాని, చంద్రబాబునాయుడు విజన్‌ నచ్చుతుంది. ఆయనో దార్శనిక నేత. అమరావతి కోసం ఎనలేని కృషి చేశారు’ అంటూ పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన వైకాపా రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి మీరావలి చేసిన వ్యాఖ్యలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Published : 05 Feb 2023 04:38 IST

చంద్రబాబుతో సెల్ఫీ వీడియోలో వైకాపా నేత మీరావలి

పెదకూరపాడు, న్యూస్‌టుడే: ‘నేను వైకాపా వీరాభిమానిని. కాని, చంద్రబాబునాయుడు విజన్‌ నచ్చుతుంది. ఆయనో దార్శనిక నేత. అమరావతి కోసం ఎనలేని కృషి చేశారు’ అంటూ పల్నాడు జిల్లా క్రోసూరు మండలం ఊటుకూరుకు చెందిన వైకాపా రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి మీరావలి చేసిన వ్యాఖ్యలు శనివారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. శుక్రవారం రాత్రి చంద్రబాబు గన్నవరం నుంచి హైదరాబాద్‌కు విమానంలో పయనమయ్యారు. మీరావలి తోటి ప్రయాణికుడిగా పరిచయం చేసుకుని, ‘నేను వైకాపా ఆవిర్భావం నుంచి పార్టీలో కీలకంగా ఉన్నా. రాజధానిగా అమరావతే ఉండాలి. మీలాంటి వ్యక్తి మాకు కావాలి. జై చంద్రబాబు.. జై అమరావతి’ అంటూ నినదిస్తూ చంద్రబాబుతో సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అభివృద్ధిని కాంక్షించే మీలాంటి యువత ముందుకు రావాలంటూ చంద్రబాబు అతనికి సూచించారు. ఈ వీడియోను మీరావలి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇది పార్టీకి నష్టం కలిగించేలా ఉందంటూ మీరావలిని విమర్శిస్తూ వైకాపా శ్రేణులు స్పందించాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు