జాతీయవాదం పేరిట దేశం పరువు తీస్తున్నారు

అదానీ ఉదంతంలో కుహనా జాతీయవాదం, ఆశ్రితపక్షపాత ధోరణితో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు శనివారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు.

Published : 05 Feb 2023 04:38 IST

అదానీ ఉదంతంపై ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: అదానీ ఉదంతంలో కుహనా జాతీయవాదం, ఆశ్రితపక్షపాత ధోరణితో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ విశ్వసనీయతను దెబ్బతీస్తున్నారని భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీ రామారావు శనివారం ట్విటర్‌లో ధ్వజమెత్తారు. జరిగిన కుంభకోణంపై విచారణకు ఇదే సరైన సమయమని, ఇలాంటి వాటిని ఆపేందుకు ఇకనైనా చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా పతాక శీర్షికల్లో ఉన్న అదానీ 2013లో ఎవరికీ తెలియదని, నరేంద్రమోదీ 2013 నవంబరు 7న సంపన్నుల గురించి చేసిన ప్రస్తావనలో ఆయన పేరు కూడా ఎత్తలేదని పేర్కొన్నారు. ఆశ్రిత పక్షపాతంతో తొమ్మిదేళ్లలో ఏ స్థాయికి చేరవచ్చో అదానీ ఉదంతం నిరూపిస్తోందని తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు