కేజ్రీవాల్‌ రాజీనామాకు భాజపా, కాంగ్రెస్‌ డిమాండ్‌

సీఎం పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ దిల్లీ భాజపా నాయకులు, కార్యకర్తలు ఆప్‌ కార్యాలయం వద్ద శనివారం భారీ ధర్నా నిర్వహించారు.

Published : 05 Feb 2023 04:38 IST

ఛార్జ్‌షీట్‌తో నైతిక అర్హత కోల్పోయారని వ్యాఖ్య

దిల్లీ: సీఎం పదవికి అరవింద్‌ కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండు చేస్తూ దిల్లీ భాజపా నాయకులు, కార్యకర్తలు ఆప్‌ కార్యాలయం వద్ద శనివారం భారీ ధర్నా నిర్వహించారు. మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ సమర్పించిన ఛార్జ్‌షీట్‌లో కేజ్రీవాల్‌ పేరు ఉన్నందున ఆయన తన పదవి నుంచి దిగిపోవాలని దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ డిమాండు చేశారు. ఈ క్రమంలో ఆ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ సైతం కేజ్రీవాల్‌ రాజీనామాకు డిమాండు చేసింది. సీఎం పదవిలో కొనసాగడానికి కేజ్రీవాల్‌ నైతిక అర్హత కోల్పోయారని, ఆయన వెంటనే గద్దె దిగాలని ఆ పార్టీ అగ్రనాయకుడు అజయ్‌ మాకెన్‌ స్పష్టం చేశారు. మద్యం కుంభకోణంలో కొల్లగొట్టిన రూ.100 కోట్లలో కొంత మొత్తాన్ని ఆప్‌ గత ఏడాది జరిగిన గోవా ఎన్నికల ప్రచారంలో వినియోగించినట్లు తాము గుర్తించామని ఈడీ తన ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని