యనమల విమర్శలపై చర్చకు సిద్ధం: మంత్రి బుగ్గన

‘రాష్ట్రంలో 11.43 శాతం వృద్ధి సాధించడం ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యనమల రామకృష్ణుడు రాష్ట్ర వృద్ధి రేటును -4 శాతంగా చెబుతున్నారు.

Published : 05 Feb 2023 04:38 IST

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో 11.43 శాతం వృద్ధి సాధించడం ప్రతిపక్షాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యనమల రామకృష్ణుడు రాష్ట్ర వృద్ధి రేటును -4 శాతంగా చెబుతున్నారు. స్థిరధరల ప్రకారం లెక్కిస్తే 11.43 శాతం వస్తుంది. ప్రస్తుత ధరల ప్రకారం లెక్కిస్తే 18.47శాతం ఉంటుంది. ఏ లెక్కనా -4 శాతం సరికాదు. దీనిపై చర్చకు సిద్ధం’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ‘జాతీయ జీడీపీ 8.7శాతం నమోదుకాగా, అంతకంటే 2.73శాతం అధికంగా జీఎస్డీపీ నమోదైంది. రాజస్థాన్‌ 11.04శాతంతో రెండో స్థానంలో, 10.88శాతంతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉన్నాయి. ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాల కారణంగా వ్యవసాయ, అనుబంధ రంగాల కింద సాపేక్షంగా అధిక వృద్ధి రేటు సాధ్యమైంది. రాష్ట్రవ్యాప్తంగా వన్‌ స్టాప్‌ సెంటర్లుగా 10,778 వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, పాల శీతలీకరణ కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలు, విలేజి హెల్త్‌ క్లినిక్‌ల కోసం వేల భవనాలు నిర్మించాం. కొవిడ్‌ సమయంలో దేశ వృద్ధిరేటు -6.60శాతం నమోదైతే, ఏపీలో 0.08శాతం నమోదైంది. ద్రవ్యోల్బణంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని యనమల నిరూపిస్తానంటే.. నేను చర్చకు సిద్ధమే’ అని బుగ్గన సవాలుచేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు