అసంతృప్తి చల్లారాలంటే ఆలోచనా తీరు మారాలి

తమ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందని, పెద్ద నాయకులతో తిట్టించినంత మాత్రాన అది ఆగదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు.

Published : 05 Feb 2023 04:38 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: తమ పార్టీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందని, పెద్ద నాయకులతో తిట్టించినంత మాత్రాన అది ఆగదని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. దిల్లీలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకుల్లో పెరుగుతున్న అసంతృప్తి చల్లారాలంటే పార్టీ అధిష్ఠానం ఆలోచనా విధానం మారాలని, తాము ప్రభుత్వానికి కేవలం ధర్మకర్తలమనే ఇంగితజ్ఞానంతో వ్యవహరించాలన్నారు. ‘మనం నియంతలం, ఎవరైనా మనం చెప్పినట్టే వినాలనుకుంటే మాత్రం పార్టీలో అసంతృప్తి పతాకస్థాయికి చేరే ప్రమాదముంది. పార్టీ ప్రజాప్రతినిధులు తన బొమ్మ పెట్టుకుని గెలిచారని, తాను చెప్పినట్టే పడి ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ అనుకోవడం సరికాదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పుడు, అదే ఎమ్మెల్యేగా గెలిచిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఉన్న అధికారాల్లో రవ్వంత వాటా కోరుకోవడం తప్పేం కాదుగా’ అని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు