భారాస నుంచి పలువురి బహిష్కరణ
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తాజాగా కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీచేసిన బాణోత్ విజయాబాయి భారాస అసమ్మతి నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో చేరారు.
మాజీ ఎంపీ పొంగులేటి నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు వేటు
ఖమ్మం నగరపాలకం, వైరా, న్యూస్‌టుడే: ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో తాజాగా కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. గత శాసనసభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా పోటీచేసిన బాణోత్ విజయాబాయి భారాస అసమ్మతి నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గంలో చేరారు. ఆదివారం ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి పొంగులేటితో పాటు నియోజవర్గానికి చెందిన పలువురు భారాస ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కాగా, భారాస అధినేతకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న పొంగులేటి ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారంటూ.. పలువురిపై పార్టీ ఆయా మండలాల నాయకులు బహిష్కరణ వేటు వేశారు. మార్క్‌ఫెడ్ ఉపాధ్యక్షుడు బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్, జూలూరుపాడు సొసైటీ అధ్యక్షుడు లేళ్ల వెంకటరెడ్డి, ఆత్మ వైరా నియోజకవర్గ ఛైర్మన్ కోసూరి శ్రీను, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ గుమ్మా రోశయ్య, రైతుబంధు వైరా, కారేపల్లి మండల కన్వీనర్లు మిట్టపల్లి నాగి, గుగులోత్ శ్రీను, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు తదితరులను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు నియోజకవర్గంలోని ఆయా మండలాల భారాస అధ్యక్షులు ప్రకటనలు విడుదల చేశారు. వైరా మున్సిపల్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టే యోచనలో పార్టీ నాయకత్వం ఉంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Lottery: సినీ నటి ఇంట్లో సహాయకుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు
-
India News
క్యాన్సర్, అధిక రక్తపోటుకు అల్లోపతిలో చికిత్స లేదు: బాబా రాందేవ్ వివాదాస్పద వ్యాఖ్యలు
-
Politics News
కేజ్రీవాల్ విందు భేటీ విఫలం.. హాజరుకాని ముఖ్యమంత్రులు
-
General News
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/03/23)
-
General News
Viral: ప్రొజెక్టర్ స్క్రీన్‌గా బెడ్‌షీట్.. ఇది కదా వాడకమంటే..!
-
Ts-top-news News
ఒకే పేరు... 38 బ్యాంకు ఖాతాలు!.. బాధితుడికి తెలియకుండానే ఆన్లైన్లో అకౌంట్లు