Yamini Sharma: జగన్‌ ఇచ్చేది పావలా.. వసూలు చేసేది రూపాయి: యామినీశర్మ

ప్రతిపక్ష నాయకుడిగా బాదుడేబాదుడు అన్న జగన్‌.. సీఎం అయ్యాక గుంజుడేగుంజుడు ప్రారంభించారని భాజపా మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు యామినీశర్మ ఎద్దేవా చేశారు.

Updated : 15 Feb 2024 16:25 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ప్రతిపక్ష నాయకుడిగా బాదుడేబాదుడు అన్న జగన్‌.. సీఎం అయ్యాక గుంజుడేగుంజుడు ప్రారంభించారని భాజపా మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు యామినీశర్మ ఎద్దేవా చేశారు. వైకాపా ప్రభుత్వం ఇచ్చేది పావలా అయితే వసూలు చేసేది రూపాయి అని దుయ్యబట్టారు. కొన్ని పార్టీలు కావాలనే కేంద్ర బడ్జెట్‌పై అనవసర విమర్శలతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని మండిపడ్డారు. విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రాభివృద్ధికి కేంద్రం కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవడంలో జగన్‌ ప్రభుత్వం విఫలమైంది. గత తెదేపా ప్రభుత్వం, ప్రస్తుత వైకాపా ప్రభుత్వం కేంద్రం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు తమ పేర్లు పెట్టుకున్నాయి. మహిళలు, బాలికల సంరక్షణ, పోషణ కోసం కేంద్రం రూ.25 వేల కోట్లు కేటాయించింది. ఏపీలో మహిళలకు రక్షణే లేదు. ఇప్పటివరకు రాష్ట్రంలో కేంద్రం 45 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వాటిపైనా పన్నులేస్తోంది. చివరకు చెత్తపైనా పన్ను విధిస్తోంది’ అని యామినీశర్మ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని