వైకాపా పాలనలో ముస్లింలపై దాడులు

Published : 06 Feb 2023 04:00 IST

మండలి మాజీ ఛైర్మన్‌ అహ్మద్‌ షరీఫ్‌

దాచేపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వ హయాంలో ముస్లిం మైనార్టీలపై 72 దాడులు జరిగాయని శాసనమండలి మాజీ ఛైర్మన్‌ అహ్మద్‌ షరీఫ్‌ ఆరోపించారు. పలువురు మహిళలు, చిన్నారులు అత్యాచారాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లిలో గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి తెదేపా మైనార్టీ ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన షరీఫ్‌ మాట్లాడుతూ.. వైకాపా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూసిందే తప్ప, సంక్షేమం, అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కదిరి మాజీ ఎమ్మెల్యే చాంద్‌బాషా మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వానికి నూకలు చెల్లాయని పేర్కొన్నారు. యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏటా హజ్‌ యాత్ర కోసం ముస్లింలకు వ్యక్తిగతంగా ఇచ్చే రూ.లక్ష సాయాన్ని కొనసాగిస్తానన్నారు. అనంతరం పలువురికి ఆర్థిక సాయం చేశారు. పిడుగురాళ్లలో అస్లాం అనే వ్యక్తి విద్యుదాఘాతంలో మృతిచెందగా.. ఆయన తల్లి గౌసియాకు రూ.2 లక్షలు అందజేసి, ఆమెకు పాదాభివందనం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు