అంబటి రాంబాబు అవినీతికి అంతేలేదు

కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తీరు ఉందని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు.

Updated : 06 Feb 2023 05:54 IST

జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు

సత్తెనపల్లి, న్యూస్‌టుడే: కాదేది అవినీతికి అనర్హం అన్నట్లుగా రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు తీరు ఉందని జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘ఎన్ని రకాలుగా అవినీతికి పాల్పడవచ్చో అంబటి హయాంలో సత్తెనపల్లి ఓ ఉదాహరణగా మారింది. లాటరీలు, ఇసుక, మట్టి మైనింగ్‌, మద్యం దుకాణాలతో పాటు చివరకు పుచ్చకాయల వ్యాపారులకు అనుమతుల్లోనూ అవినీతి చేస్తున్నారు. సత్తెనపల్లిలోని ఓ బార్‌లో ఉదయం 6.30 గంటలకు మద్యం తాగి ఒకరు చనిపోతే ఆ విషయం బయటకు రాకుండా పోలీసులతో సర్దుబాటు చేశారు. చిరువ్యాపారుల నుంచి రూ.30వేల చొప్పున వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద తురక గంగమ్మ పేరిట వచ్చిన చెక్కు ఇప్పటికీ ఇవ్వలేదు. అది ఏమైందో తెలియదు’ అని ఆరోపించారు. ‘రామకృష్ణాపురం గురుకుల పాఠశాలలో కుక్‌, వార్డెన్‌ పర్యవేక్షణలో కాకుండా, ఓ కౌన్సిలర్‌ బావమరిది కాంట్రాక్టర్‌గా ఆహారం వడ్డిస్తున్నారు. అక్కడ ఏర్పాటుచేసిన ఆర్వో ప్లాంటును వాడుకలోకి తీసుకురాలేదు. చెరువు నీటిని శుద్ధి చేయకుండానే హాస్టల్‌కు సరఫరా చేయడంతో బాలికలు అస్వస్థతకు గురయ్యారు’ అని వెంకటేశ్వరరావు డిమాండు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు