అదానీ కంపెనీలపై విచారణ జరిపించాలి: కవిత

అదానీ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు.

Published : 07 Feb 2023 03:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: అదానీ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. నిష్పక్షపాత దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం శాసనమండలి ఆవరణలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. అదానీ వ్యవహారంపై ప్రజల ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందన్నారు. ‘‘దేశంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. అదానీ సంస్థల షేర్ల విలువలు పడిపోతున్నా.. దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడబోదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించడం దారుణం. అదానీతో పాటు ఎస్బీఐ, ఎల్‌ఐసీ వంటి సంస్థల షేర్ల విలువ గత నెల నుంచి భారీగా పడిపోయాయి. దీంతో సామాన్యులకు తీవ్ర నష్టం జరిగింది. అదానీ షేర్‌ విలువపై కేంద్ర ఆర్థికమంత్రి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మోదీ మద్దతుతో అదానీ అపార సంపద కూడబెట్టారన్న విషయం ప్రపంచమంతా తెలుసు’’ అని కవిత అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని