మూడున్నరేళ్లలో ప్రభుత్వ అప్పులు రూ.6 లక్షల కోట్లు

ముఖ్యమంత్రి జగన్‌ మూడున్నరేళ్ల పాలనలో రూ.6 లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.

Published : 07 Feb 2023 04:02 IST

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ

తిరుపతి (నగరం), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌ మూడున్నరేళ్ల పాలనలో రూ.6 లక్షల కోట్లు అప్పు చేసి.. రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ల లబ్ధిదారులతో కలిసి సోమవారం ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు ప్రభుత్వం రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు.  ప్రభుత్వం చేతగానితనం కారణంగా ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందన్నారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు తారస్థాయికి చేరుకున్నాయని మండిపడ్డారు. పేదల అసైన్డ్‌ భూములను లాక్కొని ప్రజాప్రతినిధులకు కట్టబెట్టేందుకు మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై సీపీఐ రాజీలేని పోరాటాలకు సిద్ధమైందని.. ప్రజలు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వ హయంలో నిర్మించిన టిడ్కో ఇళ్ల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, వచ్చేనెల 22న లబ్ధిదారులతో కలిసి సామూహిక గృహప్రవేశాలు చేస్తామని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు