కేంద్ర బడ్జెట్‌.. పేదలపై దాడి: సోనియా

మోదీ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్‌ను పేదలపై నిశ్శబ్ద దాడిగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ అభివర్ణించారు.

Updated : 07 Feb 2023 06:38 IST

దిల్లీ: మోదీ ప్రభుత్వం 2023-24 సంవత్సరానికి సమర్పించిన బడ్జెట్‌ను పేదలపై నిశ్శబ్ద దాడిగా కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ అభివర్ణించారు. యూపీఏ ప్రభుత్వం ప్రజల హక్కుల రక్షణకు చేసిన చట్టాలన్నింటినీ మోదీ సర్కారు నిర్వీర్యం చేసిందని విమర్శించారు. మోదీకి ప్రీతిపాత్రుడైన వ్యాపారవేత్తను కుంభకోణాలు చుట్టుముడుతున్నా ప్రధాని మోదీ, ఆయన మంత్రులు విశ్వగురు, అమృత్‌ కాల్‌ అంటూ జపిస్తున్నారని ఆక్షేపించారు. ఓ ఆంగ్ల దినపత్రికకు రాసిన వ్యాసంలో సోనియా.. పేద, మధ్యతరగతి ప్రజలను, చిన్న వ్యాపారులను మోదీ సర్కారు విస్మరించిందన్నారు. కొద్దిమంది ధనిక మిత్రులకు లబ్ధి చేకూర్చిపెట్టే తాపత్రయంతో పెద్ద నోట్ల రద్దు, అవకతవకల జీఎస్టీ చట్టం, వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని విమర్శించారు. అమూల్యమైన ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ పేరుతో విక్రయించడం వల్ల యువతలో ముఖ్యంగా షెడ్యూల్డ్‌ కులాలు, తెగల్లో నిరుద్యోగం పెరిగిందని తూర్పారబట్టారు. ఎల్‌.ఐ.సి, ఎస్‌.బి.ఐ.లలో ప్రజలు దాచుకున్న సొమ్మును మోదీ ప్రభుత్వ మిత్రులకు కట్టబెట్టారన్నారు. మరోవైపు మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సర్వశిక్షా అభియాన్‌ వంటి పథకాలకు నిధులు తెగ్గోశారని సోనియా ఆవేదన వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని