దుబ్బాకకు నిధుల కేటాయింపులో వివక్ష
దుబ్బాకలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఎస్డీఎఫ్(స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు విడుదల చేయకపోవడాన్ని సవాలు చేస్తూ భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిటిషన్
ఈనాడు, హైదరాబాద్: దుబ్బాకలో అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ఎస్డీఎఫ్(స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్) నిధులు విడుదల చేయకపోవడాన్ని సవాలు చేస్తూ భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానిపై మంగళవారం జస్టిస్ పి.మాధవీదేవి విచారణ చేపట్టగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది బి.రచనారెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నియోజకవర్గ అభివృద్ధి నిధులు, ఎస్డీఎఫ్ నిధులు కేటాయించడంలేదన్నారు. భారాస ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు నిధులిస్తూ, దుబ్బాక పట్ల వివక్ష చూపుతోందన్నారు. దీనిపై అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు జోక్యం చేసుకుంటూ పిటిషన్ విచారణార్హం కాదని, అందువల్ల ప్రాథమిక దశలోనే కొట్టివేయాలని కోరారు. నిధుల కోసం కోర్టును ఆశ్రయించకుండా శాసనసభలో ప్రస్తావించాల్సి ఉందన్నారు. వివిధ కేటగిరీల కింద నిధుల కేటాయింపును ముఖ్యమంత్రితో పాటు, అసెంబ్లీ నిర్ణయిస్తుందన్నారు. శాసనసభ తీసుకోవాల్సిన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోరాదన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు పలు తీర్పులిచ్చిందని ప్రస్తావించారు. వాదనలను విన్న న్యాయమూర్తి పిటిషన్ విచారణార్హతపై నిర్ణయం వెలువరిస్తామంటూ విచారణను ఈనెల 13కి వాయిదా వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్‌లకు ఈసీ షోకాజ్ నోటీసులు
భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్‌లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి: చంద్రబాబు
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్‌పై నేను చెప్పిందే నిజమైంది: రఘునందన్‌రావు
తెలంగాణలో రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీకి భాజపా నేత రఘునందన్‌రావు ఫిర్యాదు చేశారు. -
సీట్ల సర్దుబాటు వేళ.. ఉద్ధవ్ వర్గం, కాంగ్రెస్ మధ్య ‘కిచిడీ’ చిచ్చు
ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం నేతపై కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
మహువా ప్రత్యర్థి రాజమాతకు మోదీ ఫోన్
భాజపా అభ్యర్థి రాజమాత అమృతారాయ్ (Amrita Roy)తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ (Modi).. దేశంలో అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
వైకాపా డంప్‌లు బట్టబయలైనా చర్యలేవీ?: అచ్చెన్నాయుడు
రేణిగుంట ఎఫ్‌సీఐ గోదాం వద్ద వైకాపా నేతల నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంప్‌లు బట్టబయలైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్: కేటీఆర్
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే: చంద్రబాబు
వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. -
వీహెచ్‌కు బుజ్జగింపులు.. అండగా ఉంటానని సీఎం రేవంత్ భరోసా
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్‌సభ టికెట్‌ను ఆశించారు. -
సీట్ల సర్దుబాటుపై కూటమి చర్చల వేళ.. ఉద్ధవ్ పార్టీ తొలి జాబితా విడుదల
Shiva Sena (UBT): శివసేన (యూబీటీ) పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. -
ఆ కంటెయినర్లో ఏముంది?బ్రెజిల్ సరకా.. మద్యంలో మెక్కిన రూ.వేలకోట్లా?: నారా లోకేశ్
రోజూ తన కాన్వాయ్‌ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రశ్నించారు. -
చీరాల వైకాపాలో ముసలం
బాపట్ల జిల్లా చీరాల వైకాపాలో ముసలం రేగింది. స్థానికులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. -
నా ఫోన్‌నూ ట్యాప్ చేశారు: బండి సంజయ్
గత భారాస ప్రభుత్వం తన ఫోన్‌ను ట్యాప్ చేయించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సభకు హాజరులో తెదేపా ఎంపీలదే అగ్రస్థానం
లోక్‌సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. -
జనసేనకు పవన్‌కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం
జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్.. ఆ పార్టీ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన.. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవీ.రత్నానికి చెక్కు అందజేశారు. -
శింగనమలలో భగ్గుమన్న వైకాపా అసమ్మతి
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు హెచ్చరించారు. -
10 రోజులకే మార్చారు!
వైకాపా 175 శాసనసభా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ప్రకటించిన 10 రోజులకే ముఖ్యమంత్రి జగన్ అందులో మళ్లీ మార్పులు చేశారు. -
బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్‌తో విజయసాయిరెడ్డికి సంబంధం
మాదకద్రవ్యాలతో బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రైడ్ ఈస్ట్ కంటెయినర్‌తో విజయసాయిరెడ్డికి కచ్చితంగా సంబంధం ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. -
8 మంది ఎవరో?
లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది. -
మొన్నటివరకు చెట్లు తొలగించారు.. ఇప్పుడు ఇళ్లు పీకేస్తారు
‘ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారంటే మొన్నటివరకు రోడ్డు పక్కనున్న చెట్లు తొలగించారు.. ఆయన హెలికాప్టర్లో తిరిగితే బస్సులు, బడులు చివరకు రోడ్డుపై రాకపోకలూ నిలిపేశారు. -
రేణిగుంట కేంద్రంగా వైకాపా ప్రలోభాల వల
ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాష్ట్రవ్యాప్తంగా తాయిలాలు అందిస్తున్న వైకాపా శ్రేణులు అందుకు తిరుపతి జిల్లా రేణిగుంటను కేంద్రంగా ఎంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో పింఛన్ల పంపిణీ.. వాలంటీర్లకు కీలక ఆదేశాలు
-
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్‌లకు ఈసీ షోకాజ్ నోటీసులు
-
కరెన్సీ నోట్లపై నిద్రించిన నేత.. నెట్టింట్లో వైరల్‌గా మారిన ఫొటో
-
మెదక్ జిల్లాలో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా: ఇద్దరి మృతి
-
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM