కేటాయింపులకు, ఖర్చుకు పొంతన లేని బడ్జెట్‌: వైఎస్‌ షర్మిల

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘కొత్త సీసాలో పాత సారా’ పోసినట్లుగా ఉందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు.

Published : 08 Feb 2023 04:09 IST

చిల్పూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ‘కొత్త సీసాలో పాత సారా’ పోసినట్లుగా ఉందని వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా మంగళవారం జనగామ జిల్లాలో ఆమె పర్యటించారు. చిల్పూర్‌ మండలంలోని వంగాలపల్లి వద్ద విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతేడాది బడ్జెట్నే కాపీ చేశారని ఎద్దేవా చేశారు. కేటాయింపులకు, ఖర్చులకు పొంతన లేని బడ్జెట్ను ప్రవేశపెట్టారని మండిపడ్డారు. రాష్ట్రానికి గుదిబండలా మారిన కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.1.20 లక్షల కోట్లు ఖర్చు చేసి.. మూడేళ్లకే మునిగిపోయేలా చేశారని విమర్శించారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో 33 ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయని, ఎనిమిదేళ్లుగా వాటిని ఎందుకు పూర్తి చేయలేదని ఆమె ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పెట్టిన ఖర్చులో ఒకవంతైనా వీటికి ఖర్చు పెట్టి ఉంటే ఎప్పుడో పూర్తయ్యేవన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని