జగన్‌ గ్రాఫ్‌ పడిపోతోంది.. ఏపీ వెళ్లి పాదయాత్ర చేసుకో: షర్మిలకు కడియం సూచన

‘ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ముఖ్యమంత్రి జగన్‌ గ్రాఫ్‌ పడిపోతోంది. షర్మిల అక్కడ పాదయాత్ర చేసుకుంటే మంచి అవకాశం వస్తుంది’ అని భారాస ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

Updated : 08 Feb 2023 09:57 IST

స్టేషన్‌ఘన్‌పూర్‌, న్యూస్‌టుడే: ‘ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకు ముఖ్యమంత్రి జగన్‌ గ్రాఫ్‌ పడిపోతోంది. షర్మిల అక్కడ పాదయాత్ర చేసుకుంటే మంచి అవకాశం వస్తుంది’ అని భారాస ఎమ్మెల్సీ కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. తెలంగాణ బడ్జెట్ గురించి వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. సమైక్యాంధ్ర నినాదంతో ఊరూరా తిరిగిన వ్యక్తి షర్మిల అని మండిపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీహరి మాట్లాడారు. ‘‘షర్మిలా.. నీకు ఏమైనా రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఆంధ్రకు వెళ్లి పాదయాత్రలు చేసుకో. అక్కడి ప్రజలతో మొరపెట్టుకో. రేపోమాపో నీ అన్న జగన్‌ సీబీఐ కేసులోనో లేక మీ బాబాయి వివేకా హత్య కేసులోనో జైలుకు పోతే.. మీకు ఆంధ్రలో మంచి అవకాశం వస్తుంది. అనవసరంగా తెలంగాణలో పాదయాత్రల పేరిట సమయం, శక్తి, వనరులను వృథా చేసుకోవద్దు’’ అని కడియం వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు