‘శ్రీరాంసాగర్‌’ నీరు మహారాష్ట్రను తోడుకోమనడం ద్రోహమే: పొన్నం

శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నీటిని మహారాష్ట్రను తోడుకోమని సీఎం కేసీఆర్‌ నాందేడ్‌ భారాస బహిరంగ సభలో చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Published : 08 Feb 2023 04:09 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: శ్రీరాం సాగర్‌ ప్రాజెక్టు నీటిని మహారాష్ట్రను తోడుకోమని సీఎం కేసీఆర్‌ నాందేడ్‌ భారాస బహిరంగ సభలో చెప్పడం తెలంగాణకు తీరని ద్రోహం చేయడమేనని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. తెలంగాణ ఉద్యమమే సాగునీటి కోసం వచ్చిందని గుర్తు చేశారు. జీవ నది లాంటి శ్రీరాంసాగర్‌ మహారాష్ట్ర చేతికి ఇస్తే కరీంనగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారిపోతాయన్నారు. కేసీఆర్‌ తన పార్టీ పేరును భారాసగా మార్చుకుని తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసుకోవడమే కాకుండా ఇప్పుడు రాజకీయ స్వార్థం కోసం గోదావరి నీళ్లను బలి చేస్తున్నారని పొన్నం ఆరోపించారు.

గిరిజన బంధుకు బడ్జెట్‌లో కనీసం 10% నిధులు కేటాయించాలి: రాములు నాయక్‌

గిరిజన బంధుకు రాష్ట్ర బడ్జెట్‌లో కనీసం 10 శాతం నిధులు కేటాయించాలని పీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌ డిమాండ్‌ చేశారు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా గిరిజన బంధు ప్రకటిస్తానన్న సీఎం కేసీఆర్‌.. బడ్జెట్‌లో దాని ప్రస్తావన తీసుకురాకుండా గిరిజనులను మోసం చేశారని ఆరోపించారు. జగన్‌లాల్‌నాయక్‌, సూర్యానాయక్‌లతో కలిసి మంగళవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. చిత్తశుద్ధి ఉంటే 12 మంది గిరిజన శాసనసభ్యులు జీరో అవర్‌లో ఈ అంశంపై అసెంబ్లీలో సీఎంను నిలదీయాలన్నారు.

ఎన్నికల కోసమే బడ్జెట్‌ పెట్టినట్టుంది: పొన్నాల లక్ష్మయ్య

రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2023-24 బడ్జెట్‌.. ఎన్నికల కోసమే పెట్టినట్టుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఒక ప్రకటనలో విమర్శించారు. ఇది ప్రజల మేలు కోరే బడ్జెట్‌ కాదని, ప్రభుత్వ పెద్దల సొంత ప్రయోజనాల కోసమే అన్నట్లు ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని