బోగ శ్రావణితో ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భేటీ

జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌ పదవికి ఇటీవల రాజీనామా చేసిన బోగ శ్రావణితో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భేటీ అయ్యారు.

Published : 09 Feb 2023 04:21 IST

జగిత్యాల, న్యూస్‌టుడే: జగిత్యాల పురపాలక ఛైర్‌పర్సన్‌ పదవికి ఇటీవల రాజీనామా చేసిన బోగ శ్రావణితో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ భేటీ అయ్యారు. బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన.. రాజీనామా చేయడానికి దారి తీసిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ వేధింపులు భరించలేకే రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా ఆమె ప్రవీణ్‌కుమార్‌కు వివరించారు. అనంతరం ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టలేక రాజీనామా చేసిన శ్రావణికి అండగా ఉంటామన్నారు. రాష్ట్రంలో అరాచక, గడీల పాలనకు చరమగీతం పాడుతామన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని ఏమైనా చేయాలని చూస్తే ఊరుకోమన్నారు.  రాజీనామా చేసినప్పటి నుంచి శ్రావణికి ప్రతిపక్షాల నేతలు పరోక్షంగానే సంఘీభావం ప్రకటిస్తున్నారు. బుధవారం ప్రవీణ్‌కుమార్‌ ప్రత్యక్షంగా కలవడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. బోగ శ్రావణి  బీఎస్పీలోకి వస్తామంటే సగౌరవంగా ఆహ్వానిస్తామన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు