పట్టభద్రుల్లో నిరక్షరాస్యులు

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల జాబితాలో తప్పులు విపరీతంగా చోటు చేసుకున్నాయని, కొందరికి ఒకటికంటే ఎక్కువ ఓట్లు నమోదు చేశారని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు టీవీ రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.గౌరినాయుడు, గరివిడి డివిజన్‌ అధ్యక్షుడు జె.విశ్వనాథరాజు ఆరోపించారు.

Published : 12 Feb 2023 03:46 IST

తప్పుల తడకగా ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా

చీపురుపల్లి, న్యూస్‌టుడే: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఓటర్ల జాబితాలో తప్పులు విపరీతంగా చోటు చేసుకున్నాయని, కొందరికి ఒకటికంటే ఎక్కువ ఓట్లు నమోదు చేశారని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు టీవీ రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు ఎ.గౌరినాయుడు, గరివిడి డివిజన్‌ అధ్యక్షుడు జె.విశ్వనాథరాజు ఆరోపించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో శనివారం వారు విలేకరులతో మాట్లాడుతూ... ‘చీపురుపల్లి నియోజకవర్గంలో 5,621 మంది పట్టభద్రుల ఓటర్లు ఉన్నారు. జాబితాలో 450పైగా నకిలీ ఓట్లు ఉన్నాóు. కొందరి విద్యార్హత 5, 9, 10 తరగతులుగా, నిరక్షరాస్యులుగా చూపించి ఓటు నమోదు చేశారు. చీపురుపల్లిలో 108వ నంబరు బూత్‌లో 382, 383, 384 సీరియల్‌ నంబర్లలో ఒకే వ్యక్తి పదో తరగతి చదువుకున్నట్లు చూపించి మూడు ఓట్లు నమోదు చేశారు. ఇదే బూత్‌లో 35, 44, 52, 76 సీరియల్‌ నంబర్లలో ఒకే వ్యక్తికి నాలుగు ఓట్లు ఉన్నాయి. నాలుగు మండలాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది’ అని వివరించారు. సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని