ఏపీలో కుటుంబ రాజకీయాలతో నష్టం

‘ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ రాజకీయాలు ప్రజలకు నష్టం చేస్తున్నాయి. రాజకీయాల్లో నాయకులు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగాలి కానీ.. కక్ష సాధింపులు, ప్రతీకారాలతో పొద్దుపుచ్చరాదంటూ’... కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

Published : 05 Mar 2023 08:28 IST

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

విశాఖపట్నం (పెదవాల్తేరు), న్యూస్‌టుడే: ‘ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ రాజకీయాలు ప్రజలకు నష్టం చేస్తున్నాయి. రాజకీయాల్లో నాయకులు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగాలి కానీ.. కక్ష సాధింపులు, ప్రతీకారాలతో పొద్దుపుచ్చరాదంటూ’... కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘భారత్‌దర్శన్‌లో భాగంగా కేంద్రం అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.75 కోట్లు నిధులు మంజూరు చేసింది. అన్నవరం, శ్రీశైలం, అమరావతి ఆలయాలు అభివృద్ధి చేస్తాం. రాజమహేంద్రవరంలో సంగీత నాటక అకాడమీ ఏర్పాటు చేస్తాం. హైదరాబాద్‌లో అల్లూరి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నాం...’ అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి మాధవ్‌కు మరోసారి ఓటు వేసి గెలిపించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కోరారు. భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ మాట్లాడుతూ విశాఖ పెట్టుబడుల సదస్సు విజయవంతం కావడం సంతోషదాయకమన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు