బాలాసాహెబ్‌ పేరు ఎత్తకండి.. దమ్ముంటే మోదీ పేరుతో ఓట్లడగండి: భాజపాకు ఉద్ధవ్‌ సవాల్‌

తన తండ్రి బాలాసాహెబ్‌ ఠాక్రే పేరు ఎత్తకుండా మహారాష్ట్రలో ఓట్లడిగే సాహసం భాజపా చేయగలదా అని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశ్నించారు.

Published : 06 Mar 2023 06:56 IST

ఖేడ్‌ (రత్నగిరి): తన తండ్రి బాలాసాహెబ్‌ ఠాక్రే పేరు ఎత్తకుండా మహారాష్ట్రలో ఓట్లడిగే సాహసం భాజపా చేయగలదా అని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రశ్నించారు. దమ్ముంటే మోదీ పేరుతో ఓట్లడిగి నెగ్గాలని సవాల్‌ విసిరారు. ఆదివారం రత్నగిరి జిల్లాలోని ఖేడ్‌లో నిర్వహించిన సభలో ఆయన ఈ మేరకు ప్రసంగించారు. అందరూ భాజపాను అంటరాని పార్టీగా చూసే సమయంలో తన తండ్రి ఆ పార్టీని అక్కున చేర్చుకున్నారని ఠాక్రే చెప్పారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి పార్టీ పేరు, గుర్తును కేటాయించిన కేంద్ర ఎన్నికల సంఘంపైనా ఠాక్రే భగ్గుమన్నారు. అధికార పార్టీకి ఎన్నికల సంఘం గులాంగిరీ చేస్తోందని ఘాటుగా విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని