త్రిపుర ముఖ్యమంత్రిగా మాణిక్‌ సాహా.. రేపు ప్రమాణం

త్రిపుర ముఖ్యమంత్రిగా మరోసారి మాణిక్‌ సాహా ఎంపికయ్యారు. సోమవారం జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Updated : 07 Mar 2023 05:54 IST

అగర్తల: త్రిపుర ముఖ్యమంత్రిగా మరోసారి మాణిక్‌ సాహా ఎంపికయ్యారు. సోమవారం జరిగిన భాజపా శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి ప్రతిభా భౌమిక్‌ పేరు తెరపైకి వచ్చినా చివరకు సాహాకే పదవి దక్కింది. ఆ వెంటనే ఆయన గవర్నరు ఎస్‌.ఎన్‌.ఆర్యను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరారు. ఆయన ఈనెల 8వ తేదీన ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు. 60 సీట్లున్న త్రిపుర అసెంబ్లీలో భాజపా 32 సీట్లను గెలుచుకుంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని