కొందరు దేశాన్ని అప్రతిష్ఠపాలు చేస్తున్నారు

అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠ పెరుగుతున్న తరుణంలో కొందరు విదేశీ గడ్డ మీద దేశంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆక్షేపించారు.

Published : 13 Mar 2023 04:48 IST

బ్రిటన్‌లో రాహుల్‌ వ్యాఖ్యలపై యూపీ సీఎం ఆదిత్యనాథ్‌

లఖ్‌నవూ: అంతర్జాతీయ వేదికలపై దేశ ప్రతిష్ఠ పెరుగుతున్న తరుణంలో కొందరు విదేశీ గడ్డ మీద దేశంపై విమర్శలు గుప్పిస్తున్నారని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఆక్షేపించారు. బ్రిటన్‌లో ఇటీవల కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన పేరును ప్రస్తావించకుండా యోగి ఇలా స్పందించారు. అదే వ్యక్తులు తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం గొంతునొక్కారని ఆరోపించారు. గోరఖ్‌పుర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ప్రపంచంలో మన దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీర్తిని తీసుకొస్తుంటే కొంతమంది దేశాన్ని అపఖ్యాతి పాల్జేస్తున్నారని విమర్శించారు.


రాహుల్‌ ఓటమిని మూటగట్టుకుంటారు : స్మృతి ఇరానీ

అమేఠీ: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ 2024లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటమిని మూటగట్టుకుంటారని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీకి చెందిన జగ్దీశ్‌పుర్‌లో పాన్‌టూన్‌ వంతెనను ప్రారంభించిన అనంతరం ఆమె ప్రసంగిస్తూ అమేఠీ లోక్‌సభ స్థానం ప్రజల మద్దతుతో గెలిచిన గాంధీ కుటుంబం ఆ తరువాత వారిని మరిచిపోయేవారని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని