CPI Narayana: నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చిన అధికారుల వేళ్లు నరికినా తప్పులేదు: నారాయణ

శాసనమండలి పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి పదో తరగతి చదువుకోని వాళ్లకు కూడా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లుగా నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చిన అధికారుల వేళ్లు నరికినా తప్పు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు.

Updated : 14 Mar 2023 11:04 IST

ఈనాడు, దిల్లీ: శాసనమండలి పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి పదో తరగతి చదువుకోని వాళ్లకు కూడా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినట్లుగా నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చిన అధికారుల వేళ్లు నరికినా తప్పు లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. అలా చేస్తే ఇంకోసారి తప్పు చేయరని అన్నారు. దిల్లీలోని ఏపీభవన్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలి ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో ప్రజలంతా గమనించారని అన్నారు. ఒక నియోజకవర్గంలోనే 15 వేల దొంగ ఓట్లు ఉంటే రాష్ట్రమంతా ఎన్ని ఉన్నాయో అంచనా వేయవచ్చన్నారు. ప్రత్యేకంగా ప్రింటింగ్‌ మిషన్లు పెట్టి నకిలీ ధ్రువపత్రాలు ముద్రించారని ఆయన ఆరోపించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో నిరసనల విషయంలో ఎంపీలకు హోంమంత్రి కార్యాలయం నుంచి హెచ్చరికలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్లమెంట్‌ ఆవరణలో నిరసన తెలిపే హక్కు ఎంపీలకు లేదా అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని