జాతివ్యతిరేకులు దేశభక్తిని ప్రబోధించలేరు.. నడ్డాపై కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆగ్రహం

రాహుల్‌ గాంధీపై భాజపా అధ్యక్షుడు నడ్డా విమర్శలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. దేశం ఎదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగం, ఆప్తమిత్రుడి కుంభకోణం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని.

Updated : 18 Mar 2023 05:35 IST

దిల్లీ:రాహుల్‌ గాంధీపై భాజపా అధ్యక్షుడు నడ్డా విమర్శలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తిప్పికొట్టారు. దేశం ఎదుర్కొంటున్న అధిక ధరలు, నిరుద్యోగం, ఆప్తమిత్రుడి కుంభకోణం వంటి అంశాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి భాజపా నేతలు ప్రయత్నిస్తున్నారని ఎదురుదాడికి దిగారు. స్వాతంత్య్ర పోరాటానికి మద్దతివ్వని సంస్థకు చెందిన నేతలు దేశభక్తి గురించి మాట్లాడడం తగదన్నారు. జాతివ్యతిరేకులైన ఆ వ్యక్తులు ఇతరులను దేశద్రోహులని అంటున్నారని ఆక్షేపించారు. విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో నరేంద్ర మోదీయే దేశ ప్రజలను చులకనచేసి మాట్లాడారని ఖర్గే ట్వీట్లలో పేర్కొన్నారు. అందుకు భాజపా నేతలే క్షమాపణలు చెప్పాలన్నారు. భారత ప్రజాస్వామ్యంలో జోక్యం చేసుకోవాలని విదేశాలను రాహుల్‌ గాంధీ ఏ సమయంలోనూ కోరలేదని కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పేర్కొన్నారు. ‘ఇండియాటుడే కాంక్లేవ్‌’లో ఆయన మాట్లాడారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు