దేశ వ్యతిరేక ‘టూల్‌కిట్‌’లో రాహుల్‌ శాశ్వత సభ్యుడు!

మన దేశంలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూసే ‘భారత వ్యతిరేక టూల్‌కిట్‌’ బృందంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శాశ్వత సభ్యుడయ్యారని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Published : 18 Mar 2023 05:32 IST

భాజపా అధ్యక్షుడు నడ్డా ధ్వజం

దిల్లీ: మన దేశంలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే తమ ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూసే ‘భారత వ్యతిరేక టూల్‌కిట్‌’ బృందంలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ శాశ్వత సభ్యుడయ్యారని భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతదేశ వ్యతిరేకులైన జార్జి సోరెస్‌ వంటి వ్యక్తుల భాషలో రాహుల్‌ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని బ్రిటన్‌ పర్యటన సమయంలో విదేశాలకు విజ్ఞప్తి చేయడం ద్వారా కాంగ్రెస్‌ అగ్రనేత తీవ్ర నేరానికి పాల్పడ్డారని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని శుక్రవారం ఒక ప్రకటనలో నడ్డా డిమాండ్‌ చేశారు. భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని విదేశీ గడ్డపై చెప్పడం సిగ్గుచేటని అన్నారు. దేశాన్ని, ప్రజలను, పార్లమెంటును, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రాహుల్‌ అవమానించారని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు