వివేకా హత్య కేసు నిందితులను కాపాడటానికే దిల్లీ పర్యటన: వర్ల రామయ్య

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను కాపాడటానికే సీఎం జగన్‌ దిల్లీ పర్యటనకు వెళ్లారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు.

Published : 18 Mar 2023 05:42 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులను కాపాడటానికే సీఎం జగన్‌ దిల్లీ పర్యటనకు వెళ్లారని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. జగన్‌, అవినాష్‌రెడ్డిలు ఇద్దరూ దిల్లీలో ఒకే ఇంట్లో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌పై వాడివేడిగా చర్చ జరుగుతున్న తరుణంలో హుటాహుటిన దిల్లీ ఎందుకు వెళ్లారని నిలదీశారు. దేశవ్యాప్తంగా ‘జస్టిస్‌ ఫర్‌ వివేకా’ అని నినదిస్తుంటే.. జగన్‌ మాత్రం ‘సేవ్‌ మై బ్రదర్‌’ అంటున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధానితో సమావేశమై ఏం చర్చించారని వర్ల నిలదీశారు.


జగన్‌ ఆకస్మిక పర్యటన ఎందుకు?

‘‘జగన్‌ ఆకస్మిక పర్యటన ఎందుకు?
ఆప్షన్‌ ఎ. బాబాయ్‌ కేసులో కంగారుపడి
ఆప్షన్‌ బి. ఎంపీ అరెస్టుపై కలవరపడి
ఆప్షన్‌ సి. కొత్త నోటీసులకు భయపడి
ఆప్షన్‌ డి. గూగుల్‌ టేకౌట్‌కు తత్తరపడి...’’ అంటూ ధూళిపాళ్ల నరేంద్ర శుక్రవారం ట్విటర్‌లో ఓటింగ్‌ నిర్వహించారు.
దీనికి మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ‘పైవన్నీ’ అని రీ ట్వీట్‌ చేశారు.

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని