ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద నిబంధనలు ఉల్లంఘన: చంద్రబాబు

తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ రాశారు.

Published : 18 Mar 2023 05:42 IST

ఈనాడు, అమరావతి: తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ సందర్భంగా జరుగుతున్న పరిణామాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి చంద్రబాబు లేఖ రాశారు. ‘అనంతపురంలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద పోలీసులు హడావుడి చేస్తున్నారు. యూనిఫాం, మఫ్టీలో పోలీసులు లెక్కింపు కేంద్రం లోపలికి, బయటకు తిరుగుతున్నారు. సిబ్బందిని భయపెట్టేలా వ్యవహరిస్తున్నారు. చిత్తూరు లెక్కింపు కేంద్రంలోకి వైకాపా నేత విజయానందరెడ్డి నకిలీ గుర్తింపు కార్డులతో కొందరిని కేంద్రంలోకి పంపారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్సీ పట్టభద్రుల నియోజకవర్గాల్లో ఓటమిని జీర్ణించుకోలేని వైకాపా గుండాలు తుది ఫలితాల ప్రకటనను చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ప్రజాస్వామ్య ప్రక్రియ, ఎన్నికలను నిర్వీర్యం చేసేందుకు అక్రమ మార్గాలను, హింసను ప్రయోగించడం రాయలసీమలో వైకాపా ఆనవాయితీగా మారింది...’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని