విశాఖ ప్రజలు రాజధాని వద్దని తేల్చి చెప్పినట్లయింది

ప్రశాంత వాతావరణం కోరుకునే విశాఖ ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజధాని వద్దని తేల్చి చెప్పినట్లయిందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.

Updated : 18 Mar 2023 11:14 IST

వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు

ఈనాడు, దిల్లీ: ప్రశాంత వాతావరణం కోరుకునే విశాఖ ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజధాని వద్దని తేల్చి చెప్పినట్లయిందని ఎంపీ రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. దిల్లీలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. లక్షలాది మంది పట్టభద్రులు భాజపాను, విద్యావంతుడైన మాధవ్‌ను వద్దనుకొని తెదేపా అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ద్వారా అధికార పార్టీని ఓడించాలనే లక్ష్యమే కనిపిస్తోందన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రైవేటు కళాశాలల్లోని అధ్యాపకులను చేర్చి, ఆర్జేడీల ద్వారా బెదిరింపులకు పాల్పడడం వల్లే వైకాపా బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారని అభిప్రాయపడ్డారు. హైకోర్టు ఆర్డర్‌ తీర్పు కాపీ అందగానే అవినాష్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారా? లేకపోతే వ్యక్తిగతంగా ఆశ్రయిస్తారా అన్నది తెలియాల్సి ఉందని రఘురామ చెప్పారు. వివేక వ్యక్తిగత మాజీ సహాయకుడు కృష్ణారెడ్డి వంటి వారిని ప్రవేశపెట్టడం ద్వారా కోర్టులను గందరగోళపర్చాలనే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు