కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు చెప్పారు

తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అసలు కోరనేలేదంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు.

Published : 19 Mar 2023 03:38 IST

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌-ఇల్లంతకుంట, న్యూస్‌టుడే: తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అసలు కోరనేలేదంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు పార్లమెంటు సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. కేంద్రమంత్రి ఆ తప్పుడు ప్రకటనను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో ఆయనపై సభాహక్కుల తీర్మానం ఇస్తామన్నారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుండ మండల కేంద్రంలో వినోద్‌కుమార్‌ విలేకరుల సమావేశంలో మాట్లాడటంతోపాటు హైదరాబాద్‌లో ప్రకటన జారీ చేశారు. తెలంగాణ నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని తాను కరీంనగర్‌ ఎంపీగా ఉన్న సమయంలోనే 2018లో పార్లమెంటులో ప్రధాని నరేంద్రమోదీ సహా కేంద్ర ప్రభుత్వాన్ని కోరానని వినోద్‌కుమార్‌ గుర్తుచేశారు. దేశంలోని ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయహోదా ఇక ఇవ్వబోమని అప్పటి కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ పార్లమెంటులోనే ప్రకటించారని వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని