టీఎస్‌పీఎస్సీ కేసును సీబీఐకి అప్పగించండి

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గవర్నర్‌ తమిళిసైని కోరారు.

Published : 19 Mar 2023 03:38 IST

గవర్నర్‌కు బీఎస్పీ వినతి

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సీబీఐకి అప్పగించాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డా.ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ గవర్నర్‌ తమిళిసైని కోరారు. లేని పక్షంలో సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తితో అయినా విచారణ జరిపించాలన్నారు. శనివారం పలువురు పార్టీ నేతలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగబద్ధ సంస్థ అయినందున గవర్నర్‌ జోక్యం చేసుకుని 15 ప్రశ్నపత్రాల లీకేజీకి బాధ్యులైన ఛైర్మన్‌ను బర్తరఫ్‌ చేయాలని కోరామన్నారు.  సిట్‌.. ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే పనిచేస్తుందని, ప్రభుత్వంలోని పెద్దలు లీకేజీ దోషులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తమకు సమాచారం ఉందని ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఇప్పటివరకు ఇద్దరినే అరెస్టు చేశారని, కార్యాలయంలో పాస్‌వర్డ్‌ తెలిసిన ఇతర అధికారులు, ఉద్యోగులనూ పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని వారి ఫోన్‌ డేటానూ రికవరీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట పార్టీ ముఖ్య నేతలు దయానందరావు, అనితారెడ్డి, డా.వెంకటేష్‌ చౌహాన్‌, మౌలానా షఫి, డా.సాంబశివగౌడ్‌, అరుణ క్వీన్‌ తదితరులున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు