నిరుద్యోగ భృతికి నిధులు ఇవ్వండి: ఎమ్మెల్యే జగ్గారెడ్డి

సీఎం కేసీఆర్‌ ఎన్నికల మెనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలుకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు.

Published : 19 Mar 2023 04:15 IST

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: సీఎం కేసీఆర్‌ ఎన్నికల మెనిఫెస్టోలో నిరుద్యోగులకు ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ అమలుకు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించానని, ఎన్నికలకు ఇంకా 8 నెలలే ఉన్న నేపథ్యంలో కేసీఆర్‌కు మరోసారి గుర్తు చేయడానికి లేఖ రాస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

నిరుద్యోగి ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం: మాజీ ఎంపీ పొన్నం

సిరిసిల్లలో నిరుద్యోగి నవీన్‌ ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. నవీన్‌ ఆత్మహత్యపై భాజపా వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఆయన శనివారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఎస్‌పీఎస్సీ విజయాలను తమవిగా ప్రచారం చేసుకున్నప్పుడు..తప్పులను కూడా ప్రభుత్వం తమవని అంగీకరించాలి కదా? అని ప్రశ్నించారు. పరీక్ష పేపర్లు లీక్‌ కాకుండా సాంకేతికతను సమకూర్చాల్సిన బాధ్యత ఐటీ డిపార్టుమెంటుకు లేదా? అని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వచ్చే టెక్స్‌టైల్‌ పార్కును సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు